అందరినీ ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ హైవే పోస్టర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఇటీవల పుష్పక విమానం ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఆనంద్ దేవరకొండ హీరో గా కె.వి.గుహన్ డైరెక్షన్లో రూపొందుతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. హైవే. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఇందులో ముఖ్యంగా.. బాలీవుడ్ హీరో మిర్జాపూర్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఇక ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌లో ఉన్నాయి. మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాత వెంకట్ తలారి.

Share.