మెగాస్టార్ ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఆయన ఈ మధ్యన లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ..అంతేకాకుండా వీరిద్దరూ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుణ్ తేజ్ చాలా గ్యాప్ తీసుకొని ఈ మధ్యనే గాండివ దారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది… ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్‌ను నిన్న హైదరాబాదులో నిర్వహించారు.ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యతగా వ్యవహరించారు. అయితే వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న జంటకు మధ్యలో సుమ చిచ్చు పెట్టిందని తెలుస్తోంది.. అయితే ఇంతకు అసలు విషయానికి వస్తే సుమ ఈ కార్యక్రమంలో భాగంగా వరుణ్ తేజ్ ను ఒక ప్రశ్న వేసింది. అదేంటంటే కాల్ మీ అర్జెంట్ అంటూ నిహారిక మెసేజ్ పెట్టిన అలాగే లావణ్య త్రిపాఠి కి మెసేజ్ పెట్టిన మీరు ఎవరికి మొదట ప్రిఫరెన్స్ ఇచ్చి కాల్ చేస్తారుఅని అడిగింది.
వెంటనే సుమ అడిగిన ప్రశ్నకు షాక్ అవుతూ తల పట్టుకున్నాడు.. వరుణ్ అయితే ఆయన బాగా ఆలోచిస్తూ ముందుగా నా చెల్లెలకే కాల్ చేస్తాను. ఎందుకంటే నిహారిక చిన్నమ్మాయి కాబట్టి తనకే ముందు కాల్ చేస్తాను అప్పుడు సుమ మీరు చెల్లెలు కి కాల్ చేయడం కరెక్టే దానికి మంచి మార్కులు వేస్తాను. ఆ తరువాత సుమ లావణ్య త్రిపాఠి ఇంటికి వెళ్లాక మీరు మీరు చూసుకోండి.. అని చెప్పడంతో బాగా నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..అంతేకాకుండా వరుణ్ తేజ్ ని ఎందుకు ఇరికించారు సుమ అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.