అలాంటి వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీపై ఆరోగ్య సమస్యలు ఎక్కువగా పడుతున్నాయి. మొన్నటికి మొన్న సమంత మావోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన సంగతి మనకు తెలిసిందే.. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస బుల్లితెర అవకాశాలను అందుకుంటున్న యాంకర్ సుమ వెండితెరపై కూడా వెలగాలని చూస్తోంది. ఈమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రేర్ డిసీస్ ఉంది అంటూ ఓపెన్ గా చెప్పేసింది. ఈమధ్య సెలబ్రిటీలు ఏ సమస్య వచ్చినా ఓపెన్ గా చెప్పేసుకుంటున్నారు.

Telugu Television (TV) Anchor Suma Kanakala Childhood Photos

అయితే సుమ కిలాయిడ్ టెండర్స్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని అది చర్మవ్యాధి కారణంగా వస్తోందని ఈ వ్యాధితో కొన్ని సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని..అంతేకాకుండా ఈ సమస్య వల్ల ప్రతిసారి మేకప్ వేసుకున్నప్పుడు దురదలు, రాసేస్, మరీ ముఖ్యంగా మంటలు వేసేవని కానీ వాటన్నింటినీ భరించి మేకప్ వేసుకునే దాన్నని చెప్పుకొచ్చింది సుమ. అంతేకాకుండా నా కెరీర్ స్టార్టింగ్ లో నాకు ఎలా మేకప్ వేసుకోవాలి..? ఎలా తీసేయాలి..? అనే విషయాలు కూడా తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు మేకప్ ఏ జీవితం అయిపోయింది. అంతేకాకుండా ఆ మేకప్ వల్ల చర్మం డ్యామేజ్ కూడా అయ్యింది.

ఇంకా చెప్పాలంటే ఒక్కచోట గాయమైతే అది తగ్గకుండా అక్కడే పెద్దగా మారి చాలా పెద్దగా వ్యాపించేదని దీంతో పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉండేదని చెప్పుకొచ్చింది సుమ..అయితే ఇది విన్న అభిమానులు అందరూ సుమ ఇలాంటి డేంజరస్ వ్యాధితో పోరాడిందా అని చాలా బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో యాంకర్లకు అలాగే సెలబ్రిటీలకు ఇండస్ట్రీ వాళ్లకు ఇలానే జరుగుతున్నాయి. రకరకాల వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. మరి దీనికి కారణం ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు అంటూ కొందరు వాపోతున్నారు.

Share.