నన్ను క్షమించండి బాబోయ్ అంటున్న యాంకర్ రవి!

Google+ Pinterest LinkedIn Tumblr +

టెలివిజన్ రంగంలో కాస్త పాపులారిటీ సంపాదించిన యాంకర్లు ఈమద్య తమ నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేయడం తర్వాత నెటిజన్ల నేత చివాట్లు తినడం కామనం అయ్యింది. ఆ మద్య జబర్ధస్ హాట్ యాంకర్లు అనసూయ, రష్మిలు సోషల్ మాద్యమాల ద్వారా ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించారు..తర్వాత క్షమాపణలు కోరారు.

తాజాగా ఇప్పుడు మెయిల్ యాంకర్ రవి ఏపి ప్రజలను క్షమించండి బాబోయ్ అంటున్నాడు. పటాస్ లో మెయిల్ యాంకర్ గా మంచి పేరుతెచ్చుకున్న రవి గతంలో పలుమార్లు తన నోటి దూలతో నెటిజన్లచేత ఛీ కొట్టించుకున్నాడు. ఇటీవల ఓ టివి షో లో ఏపి ప్రజలకు అనుచిత వ్యాఖ్యలు చేశాడు

అప్పటి నుంచి యాంకర్ రవిని టార్గెట్ చేసుకొని సోషల్ మాద్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మీ ప్రోగ్రామ్స్ చూడటానికి ఇదే జనాలు కావాలి..మరి వారి గురించి ఎలా నీచంగా మాట్లాడుతావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. . ప్రజలను అవమానించే విధంగా కామెంట్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. యాంకర్ రవి పర్సనల్ అసిస్టెంట్ ఫోన్‌కు కాల్ చేసి మండిపడుతున్నారు.

ఇక లాభం లేదనుకున్న యాంకర్ రవి తానే స్వయంగా తనను ఏపి ప్రజలు క్షమించాల్సిందిగా ట్విట్టర్ లో కోరారు.

Share.