యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లిస్టులో ఉంటాడు అనే భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అతను ఎలిమినేట్ అయిన బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో రవిని చాలావరకు నిజంగానే చూపించారు. ఈ క్రమంలోనే అతడికి గుంటనక్క, ఇన్ ఫ్లూయెన్సర్,నారదుడు అన్నిరకాలుగా పేర్లు పెట్టారు. అయినా కూడా రవి సహనాన్ని కోల్పోకుండా గేమ్ ఆడుతూ వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ కి రవి భార్య, కూతురు రావడంతో అతనిపై ఉన్న నెగిటివిటీ పటాపంచలైంది.
కానీ అదే వారం బిగ్ బాస్ హౌస్ లో రవికి ఆఖరి వారం అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రవి పలురకాల ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇటీవల రవికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. నేను నచ్చకపోతే నన్ను తిట్టండి,కొట్టండి కానీ నా ఫ్యామిలీ జోలికి రావద్దు.. అలా వస్తే సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు అని తెలిపారు. అలాగే గతంలో తనకు ఒక నమ్మకద్రోహం జరిగిందని. రవి వద్దకు అన్నా బిజినెస్ పెట్టాలి మా పరిస్థితి అంత బాగోలేదు అని ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చాడని, రెండు సంవత్సరాల పాటు తనతోనే ఉన్న వ్యక్తి, రోజు గుడికి వెళ్తాడు నమ్మకస్తుడు అని ఆలోచించకుండా వెంటనే అతడికి 45 లక్షల రూపాయలు ఇచ్చాడట. అలా ఇరవై రోజుల్లోనే తిరిగి ఇస్తాను అని అతను ఇప్పటికీ ఇవ్వలేదు.. అతను నన్ను మోసం చేశాడు అని తెలిపాడు. ఆ డబ్బు రావాలని నా భార్య ఉపవాసాలు పూజలు చేసింది అయినప్పటికీ డబ్బు తిరిగి రాలేదని చెప్పుకొచ్చాడు రవి.