ఎన్టీఆర్ ని సర్ ప్రైజ్ చేసిన ప్రముఖ యాంకర్ భార్గవి

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ టీ వీ యాంకర్ గాయత్రి భార్గవి ఈ రోజు తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఒక బహుమానం ఇస్తున్న ఫోటో ఒకటి షేర్ చేసారు. ఇక ఈ బహుమతి ఏమిటో తెలిసిన వెంటనే ఎలాంటి వారైనా కొంచం ఉద్వేగానికి లోనౌవటం ఖాయం. గాయత్రి భార్గవి ట్వీట్ చేస్తూ ” మా తాతయ్య శ్రీ శంకర్ నారాయణ గారు ఎంతో అద్భుతంగా పెన్సిల్ తో నందమూరి హరి కృష్ణ గారి బొమ్మని గీశారు,
మా తాతయ్య కి 80 సంవత్సరాలు. ఈ రోజు నేను స్వయంగా ఈ చిత్ర పటాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారికి అందచేసాను.

ఎన్టీఆర్ గారు ఈ బహుమానం అందుకోగానే అయన కళ్లలోని ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇది చూసినా వెంటనే అయన ఎంతో ఉద్వేగంతో ” ఇది తీసుకు వెళ్లి అమ్మకు ఇస్తానండి, థాంక్ యూ ” అని చెప్పారని ట్వీట్ చేసారు యాంకర్ భార్గవి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్ లో వైరల్ గా మారింది.

Share.