తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అదే క్రేజ్ తో తెరపై కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ లకు సమానమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఒకవైపు బుల్లితెరపై పలు ఈవెంట్ లలో సందడి చేస్తూనే, మరొకవైపు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఇటీవలే అనసూయ తండ్రి సుదర్శన్ రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా అనసూయ తన తండ్రిని తలచుకొని తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.
మీరిచ్చిన జీవితానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మాకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపిన నేర్పించారు. అంతేకాకుండా ఇలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండమని నేర్పించారు. మాతో మీరు గడిపిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. అర్ధరాత్రులు మీరు ఇచ్చే సర్ ప్రైజ్ లు ఎప్పటికీ మర్చిపోలేను..అదంతా కూడా మాపై మీకున్న అమితమైన ప్రేమ.. తండ్రి స్థానంలో ఎంత గొప్పగా ఆదర్శంగా నిలిచారు. ఎప్పటికీ మిమ్మల్ని గర్వపడేలా చేస్తామని మాట ఇస్తున్న నాన్న. మీరు మానుండి దూరం అయినప్పటికీ మాతోనే ఉంటారు అని బలంగా నమ్ముతున్నాను..మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.