జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి మనందరికీ తెలిసిందే. బుల్లితెరపై యాంకర్గా సందడి చేస్తూనే మరొకవైపు వెండితెరపై పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్త గా నటించి ఇండస్ట్రీలో పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో మంగళం శ్రీను భార్య కనిపించింది. ఈ సినిమాలో అనసూయ మాస్ లుక్ లో కనిపించినప్పటికీ. ఆమె పాత్ర తక్కువగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు రంగమ్మత్త గా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ, ప్రస్తుతం దాక్షాయణి గా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. పుష్ప సినిమాలో దాక్షాయిని గా నటించడానికి అనసూయ ఎంత పారితోషకం తీసుకుంది అన్న విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. పుష్ప సినిమాలో నటించడానికి ఒక రోజుకు అనసూయ 1.5 అందుకు ఉందట. ఆ ప్రకారంగా 10 రోజులకు కలిపి 12 లక్షల వరకూ తీసుకుంది అని సమాచారం. మొదటి పార్టు లో అనసూయ రోల్ తక్కువగా ఉన్నప్పటికీ సెకండ్ పార్ట్ లో మాత్రం అనసూయ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తోంది.