యాంకర్ ప్రదీప్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంది..కానీ చివరికి పాడెక్కింది..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటూ ఉండడం సినీ ఇండస్ట్రీ వర్గాల వారిని కలచివేస్తోంది.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలతో కొందరిలో భయం మొదలైంది. పునీత్ రాజ్ కుమార్, శివ శంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనసూయ తండ్రి సుదర్శన్ , హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు, ఇక తాజాగా సత్యరాజ్ చెల్లెలు కూడా గుండెపోటుతో మరణించారు. తాజాగా కేవలం 27 సంవత్సరాలు వయసు కలిగిన నటి చనిపోవడం సినీ ఇండస్ట్రీ లో కలకలం రేపుతోంది. యాంకర్ ప్రదీప్ ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది.. కానీ ఇలా 27 ఏళ్లకే పాడెక్కడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంటోంది.

బుల్లితెర నటి శ్రీయ మురళీధరన్.. ఈమె అతి చిన్న వయసులోనే గుండెపోటుకు కారణం అయ్యింది. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో శ్రీయ మరణించిందని సమాచారం.హైదరాబాద్ లోని ల‌క్డిక‌పూల్‌‌ ఏరియాకి చెందిన శ్రియా మురళీధరన్ బుల్లితెర పై యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అటు తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించి యూత్ కు దగ్గరయ్యింది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లో కూడా ఓ పాత్ర పోషించింది.అలాగే ‘వాట్ ద ఫన్’ యూట్యూబ్ ఛాన‌ల్‌లో కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది శ్రీయ. ఈ మధ్యనే ఈమెకు సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయట. కానీ బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే తన కోరిక నెరవేరకుండానే ఆమె స్వర్గస్తురాలు కావడం చాలా విషాదకరం

ఇకపోతే ఈమె మరణానికి దీప్తి సునైనా , నటి సురేఖ వాణి కూతురు సుప్రియ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Share.