చేజేతులారా కెరీయర్ని నాశనం చేసుకుంటున్న అనసూయ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ ఆ తర్వాత అనుకోని కారణం చేత బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో గతంలోనే పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది అనసూయ. కానీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇమే పాపులర్ అయ్యింది.ఈ పాపులర్ తోనే పలు సినిమాలలో నటించే అవకాశాలు వెలుపడ్డాయి. అలా ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిపోయింది.

Offensive Photos Of Anasuya Bharadwaj: Man Arrested

అయితే అనసూయ ఇలా సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ షో ని ఆయిష్టంగానే వదిలిపెట్టడంతో ఈమె క్రేజ్ మరింత పతనం అయిపోయింది. ముఖ్యంగా నిత్యం ఏదో ఒక వార్తలలో ఈమె చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. అనసూయ ఏదో ఒక వివాదంలో తల దూర్చడం వల్ల ఈమెకు ఉన్న పరువు కూడా పోగొట్టుకునేలా చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది అనసూయ. జబర్దస్త్ షోలో ప్రతివారం కనిపిస్తూ ఉండడం వల్ల బాగా పాపులర్ అయ్యేది.

కానీ ఈ మధ్య ఆ షో మానేయడం వల్ల కొద్దిగా అనసూయ దూకుడు తగ్గిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చేస్తున్న సినిమాలు సెట్స్ మీద ఉండగానే అవి రిలీజ్ అయితే కానీ అనసూయ హడావిడి మొదలు కావడం లేదు. అనసూయ చేస్తున్న సినిమాల వల్ల ఆమె క్రేజ్ మాత్రం పెద్దగా పెరగలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా పుష్ప -2 చిత్రంలో అనసూయ నటిస్తోంది ఆ తర్వాత రంగమార్తాండ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు.

అనసూయ కెరియర్ పరంగా ప్లస్ అయ్యే చిత్రాలలో నటిస్తున్నప్పటికీ ప్రస్తుతం అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో అభిమానులు మాత్రం అనసూయ బుల్లితెరపై ఉన్నప్పుడే మంచి క్రేజీ ఉండేది అలా బుల్లితెర, వెండితెర పైన బాగానే సంపాదిస్తూ ఉండేది బుల్లితెరకు గుడ్ బై చెప్పడంతో అనసూయ పెద్దగా క్రేజ్ రా పెట్టుకోలేక చేజేతులారా తన కెరీయర్ని నాశనం చేసుకుంటోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీంతో అనసూయ బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.

Share.