సినీ ఇండస్ట్రీ అనేది పైకి చూడడానికి కేవలం ఒక రంగుల ప్రపంచం లాగా ఉంటుంది.. కానీ లోపల మాత్రం చాలా లొసుగులు ఉంటాయని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే మాత్రం కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా కొన్ని పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయని కొంతమంది నటీమణులు సైతం ఎన్నో సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ విషయం మరింత వైరల్ గా మారుతోంది .తమకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెబుతూ ఉన్నారు.
తాజాగా ఈ విషయం పైన హాట్ యాంకర్ అనసూయ కూడా స్పందించడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అనసూయ మాట్లాడడం జరిగింది.. అనసూయ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాలలో కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉన్నది. కానీ సినీ రంగంలో కాస్త ఎక్కువగానే ఉంది. మన టాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూనే ఉంది.. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యాను అప్పట్లో తనను కూడా కొందరు కోరిక తీర్చమంటూ వేధించారంటూ బాంబు పేల్చింది అనసూయ.
కానీ అలాంటి పనులకు అసలు ఒప్పుకోలేదు. దీంతో రెండేళ్ల పాటు అవకాశాలు లేక నిస్సహాయురాలుగా మిగిలిపోయాను కానీ నేను మాత్రం టాలెంట్ తోనే అవకాశాలను అందుకున్నానని తెలిపింది అనసూయ. ఒక స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఇలాంటివి ఎదుర్కను అప్పుడు ఆటోమేటిక్గా అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయని తెలుపుతోంది. అనసూయ ఇప్పుడు బుల్లితెర పైన పెద్దగా కనిపించలేదు.కానీ వెండితెర పైన కనిపించాలని చాలా ఆతృతగా పలు సినిమాలలో నటిస్తూనే ఉంది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.