మొన్నటివరకు యాంకర్ గా అనసూయ బుల్లితెరపై సత్తా చాటింది. బుల్లితెర పైన పాపులారిటీతోనే వెండితెర పైన కూడా నటిగా మెప్పించి మంచి పాపులారిటీ రావడంతో దూరంగా ఉంటూ సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా తన సమయాన్ని గడిపేస్తోంది.. కాక సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను కుటుంబ విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది.
ప్రస్తుతం హరిహర వీరమల్లు, పుష్ప -2 చిత్రంలో నటిస్తోంది అనసూయ వీటితో పాటే సౌత్ ఇండస్ట్రీలో ఇతర భాషలలో కూడా నటిస్తోంది. అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ట్రోల్స్ కు కూడా గురవుతూ ఉంటుంది తరచూ ఏదో ఒక కాంట్రవర్సీల తో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నా అనసూయ అప్పుడప్పుడు విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.
మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండకు వివాదాన్ని కూడా ముగించేసింది అనసూయ అలాగే తన తమ్ముడు ఆనంద దేవరకొండ సినిమాకు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక ట్విట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తరచూ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా చూసిన అభిమానులు అనసూయ కి ఏమైంది అసలు ఎందుకు సడన్గా ఈ చేంజ్ చేసి ఈ మార్పులు ఏంటి అనే విషయంపై పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే అనసూయ తాజాగా మరొక కొత్త వీడియోను పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. అందులో తన లో వచ్చిన మార్పులను గురించి వివరించడం జరిగింది.. ప్రస్తుతం అనసూయ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని తన ప్రాధాన్యతలు మారాయని తన అభిరుచులు కూడా మారాయని దీంతో పాటుగా తన సహనం కూడా పెరిగిపోయింది అంటూ తన మార్పుల గురించి తెలియజేసింది అనసూయ. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram