బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట న్యూస్ రీడర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన అనసూయ పలు సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్ లలో నటించింది. జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన తర్వాత అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఈ చిత్రం తర్వాత అనసూయకు పలు సినిమాలను నటించే అవకాశాలు అందుకుంది.సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వాటిని తెలియజేస్తూ ఉంటుంది.
అయితే గడిచిన కొన్ని నెలల క్రితం నుంచి అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడంతో కాస్త తగ్గని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా అనసూయ పైన పలు రకాలుగా ట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. తాజాగా అనసూయ శ్రీకాళహస్తిలో కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పుష్ప చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అనసూయ పుష్ప -2 చిత్రంలో కూడా అనసూయ నెగిటివ్ షెడ్డు ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
2023 ఏడాది కొత్త సంవత్సరం వేడుకలను అనసూయ చాలా గ్రాండ్గా జరుపుకున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే రెమ్యూనరేషన్ విషయంలో కూడా అనసూయ కాస్త బాగా పెంచేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ ఈ మధ్యకాలంలో కాస్త ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమెకు 37 సంవత్సరాలు కాగా హీరోయిన్గా పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది అనసూయ. అభిమానులు మాత్రం అనసూయను జబర్దస్త్ లోకి రియంట్రిగామని కోరుతున్నారు.
View this post on Instagram