నిశ్చితార్థం చేసుకున్న శంకర్ బ్యూటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాల్లో హీరోయిన్లు మహా అంటే ఒక్కసారి మాత్రమే కనిపిస్తారు. కానీ ఒకటి కంటే ఎక్కువసార్లు కనిపించిన హీరోయిన్లు చాలా తక్కువే. ఇందులో తాజాగా చేరిన బ్యూటీ అమీ జాక్సన్. ఐ, రోబో 2 చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ అడపాదడపా చిత్రాలలో నటిస్తూ, తన సోషల్ అకౌంట్‌లలో హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. కాగా తాజాగా ఈ బ్యూటీ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అమీ జాక్సన్ గతకొన్నేళ్లుగా జార్జ్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని అందరికీ తెలిసిందే. కాగా వీరిద్దరు డేటింగ్ చేస్తు్న్నట్లు అనేక వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నట్లు అమీ జాక్సన్ చెప్పకనే చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఒక హాట్ ఫోటోను తన సోషల్ అకౌంట్‌లో షేర్ చేసి తన జీవితంలో కొత్త అధ్యయనం మొదలైందని ఆమె ట్వీట్ చేసింది. దీంతో అమీ జాక్సన్ ఎంగేజ్‌మెంట్‌ను దాదాపు ఖరారు చేసిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేసే అమీ జాక్సన్, మేగజైన్ కవర్ పేజీల్లో హాట్ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసి.. ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్‌ను నిశ్చితార్ధం చేసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా ఆమె వివాహ జీవితం బాగుండాలని మరికొందరు ఆమెకు విషెస్ చెబుతున్నారు.

Share.