డైరెక్టర్ రాజమౌళి అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలియని వారంటూ ఎవరు ఉండరు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ నలుమూలలకు విస్తరింప చేసేలా చేశారు రాజమౌళి. బాహుబలి సినిమాతో తన ఏంటో దేశానికి తెలిసేలా చేశారు. అటు తరువాత RRR సినిమాతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు రాజమౌళి. ఇప్పటివరకు కేవలం 13 సినిమాలను మాత్రమే తెరకెక్కించారు. ఇందులో ఏ ఒక్క సినిమా కూడా అపజయమంటూ రాలేదు. రాజమౌళి చేసిన సినిమాలన్నిటిలో ఎన్టీఆర్ తో ఎక్కువగా సినిమాలు చేశారు.
ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశారు. ఇదంతా ఇలా ఉండగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులలో ఎంత క్రేజీ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే రాజమౌళి భార్య రమా రాజమౌళికి మాత్రం రాజమౌళి దర్శకత్వంలో వహించిన ఒక సినిమా అంటే అసలు నచ్చదట. ఆ సినిమా గురించి ఇప్పుడు ఏదో ఒకసారి మనం తెలుసుకుందాం. రాజమౌళి భార్య కూడా రాజమౌళి సినిమాలలో భాగమౌతు ఉంటుందనే విషయాన్ని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు రాజమౌళి. అయితే ఆ మధ్య రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో యమదొంగ సినిమా ఆమెకు నచ్చలేదని తెలిపారు.
యమదొంగ సినిమా డైరెక్షన్ తనకు అంతగా నచ్చలేదని ఎందుకో తెలియదు కానీ ఆ సినిమా తనకు ఇష్టం లేదని తెలియజేసింది రమా రాజమౌళి. అలాగే ఎన్టీఆర్ మాత్రం అద్భుతంగా నటించారు.. అసలు తారక్ వల్లే ఆ సినిమా నిలబడిందనిపించిందని రమా రాజమౌళి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.