ఎప్పుడో తెలుగులో ఇరవైయేళ్ల క్రితం పూరి జగన్నాథ్ తొలి సినిమా బద్రీ ద్వారా తెలుగు ప్రజలకు హీరోయిన్గా పరిచయం అయ్యింది అమీషా పటేల్. ఆ సినిమాలో పవన్ పక్కన రొమాన్స్ చేసిన అమీషాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగులో ఎన్టీఆర్, మహేష్‌బాబు లాంటి స్టార్ హీరోల పక్కన కూడా నటించింది. అయితే తెలుగులో ఎందుకో గాని ఆమెకు బ్రేక్ రాలేదు.
కెరీర్ సాఫిగా సాగిపోతుందన్న సమయంలో ఒక్కసారే అవకాశాలు తగ్గడంతో హాట్ హాట్ ఫోటోషూట్లతో కాలం గడుపుతోంది. ఇటీవల 43వ వడిలోకి ఎంట్రీ ఇచ్చిన అమీషా ప్రతి రోజు తన హాట్ ఫొటోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ వాటికి వచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోతున్నట్టు ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె కష్టాల్లో పడింది. ఓ సినిమా తీసేందుకు అజయ్‌కుమార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర ఆమె రూ.3 కోట్లు తీసుకుంది. ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో ఆ అప్పు ఇవ్వలేదట. ఆమె ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అవ్వడంతో అజయ్ కోర్టును ఆశ్రయించాడు. రాంచీ కోర్టులో కేసు ఫైల్ అయింది.
ఫైనాన్షియర్ నుండి మూడు కోట్ల రూపాయలు అప్పు ఎగవేసినందుకు ఆమెకు కోర్టు సమాన్లు జారీ చేసింది. దీని ప్రకారం ఈ నెల 8న ఆమె కోర్టుకి హాజరు కావాలి, లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారట. తన అప్పు చెల్లించమని ఎప్పుడు అడిగినా అమీషా తప్పించుకుని తిరుగుతోందంటూ అజయ్ కోర్టులో ఫిటిషన్ వేయడంతో ఆమె ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి వచ్చింది.