బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమమని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారమవుతూ ప్రేక్షకుల ఆదరణ బాగానే పొందింది .ఇక తెలుగులో కూడా ఇప్పటివరకు ఆరు సీజన్లను పూర్తిగా చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఈ కార్యక్రమంలో ఏడవ సీజన్లో పాల్గొనబోయే కంటెంట్స్ ఎంపిక ప్రక్రియ బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంలో బిజీగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పలువురు కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారని మరోకసారి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడు జానకి కలగలేదు సీరియల్ హీరో అమరదీప్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ 6 లోనే అవకాశం వచ్చిందని కానీ పాల్గొనలేదని వార్తలు అప్పట్లో వినిపించాయి.. తనకు ఎలాంటి అవకాశం రాలేదని తనను ఎవరు సంప్రదించలేదని తాజాగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఇకపోతే తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ మరొకసారి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్ దీప్ ఈ విషయం గురించి మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ సెవెన్ లో తాను పాల్గొన్న పోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి నేను కూడా చూశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలో లేదా అనేది పూర్తిగా స్టార్ మా చానల్ వారి పైన ఆధారపడి ఉంటుంది.. ప్రస్తుతం తాను స్టార్ మా చానల్లో కొలు సీరియల్స్ లో బిజీగా ఉన్నానని తెలిపారు.
తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తారా లేదా అన్నది పూర్తిగా వారి అభిప్రాయమే వారి నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు .మరి స్టార్ మా ఛానల్లో వారు తనని బిగ్ బాస్ కార్యక్రమానికి పంపిస్తారో లేదో చూడాలి మరి.