మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ” అమర్ అక్బర్ ఆంటోనీ “. ఇలియానా చాల కాలం తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. ఇక ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన మినీ టీజర్ ని పీవోట్ పేరుతో మైత్రి సంస్థ విడుదల చేసింది. ఈ టీజర్ లో రవి తేజ మూడు విభిన్న గెట్ అప్స్ లో కనిపించటం విశేషం. పేరులో ఉన్నట్టే రవి తేజ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలు చేయనున్నారట. టీజర్ మొదట్లో దర్శకుడు గుడ్లగూబను తెర పై చూపించటం కూడా కొంత వరకు ఆసక్తిని కలిగించింది.
శ్రీను వైట్ల – రవి తేజ కాంబో లో వస్తున్న నాలుగవ చిత్రం ఇది. గతంలో వచ్చిన నీ కోసం, వెంకీ , దుబాయ్ శీను సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ” అమర్ అక్బర్ ఆంటోనీ ” పై కూడా ప్రేక్షకుల్లో బారి అంచనాలు నెలకొన్నాయ్.