తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ఇమేజ్ ఉంది.. అలాగే అక్కినేని వారసుడిగా నాగార్జున కూడా అంతకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల రాకుమారుడిగా మన్మధుడిగా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున.. లక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని నాగచైతన్యకు జన్మనిచ్చారు. ఆ తరువాత కొన్ని కారణాలవల్ల నాగచైతన్య తల్లి లక్ష్మికి విడాకులు ఇచ్చి నాగార్జున అమలని పెళ్లి చేసుకున్నాడు.అయితే అప్పటికే నాగార్జునకు పెళ్లయింది అని .. ఒక బిడ్డ ఉన్నాడు అని తెలిసిన అమల తల్లిదండ్రులు ఎందుకు అమలను నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు అనే విషయం అప్పట్లో వైరల్ గా మారింది.
అయితే నాగార్జునకు అమల వాళ్ళ తల్లిదండ్రులకు కండిషన్ పెట్టి మరి అమలా నిచ్చి పెళ్లి చేశారట. ఇంతకు అమల తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వు నీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్టు నా కూతురుకు ఇవ్వకూడదు. భార్యాభర్తలు అన్నాక ఏదో గొడవలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ సర్దుకొని పోవాలి అంతేకానీ విడాకులు ఇవ్వకూడదు.
మరొక విషయం ఏమిటంటే మీ మొదటి భార్య నుండి నా కూతురికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అంతేకాకుండా నీ మొదటి భార్య నా కూతుర్ని అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని కూడా కండిషన్ పెట్టారట అమల తల్లిదండ్రులు. కానీ లక్ష్మీ మంచి మనిషి కాబట్టి వారిద్దరి పెళ్ళికి ఒప్పుకుంది అలా అమల వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ని ఒప్పుకొని మరి పెళ్లి చేసుకొని ఇప్పుడు వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా కూడా నిలిచారు ఈ జంట.
అమల నాగార్జునకి అఖిల్ అనే కుమారుడు జన్మించారు ప్రస్తుతం నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు. ముఖ్యంగా నాగర్జున ఇప్పటికీ కూడా అదే ఫిజిక్ ని గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉన్నారు.