అమలాపాల్ ఈమె మలయాళ నటి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం రామ్ చరణ్ నాయక్ సినిమాతోనే పరిచయమైంది.. ఆ తరువాత అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిల సినిమాలో నటించి మెప్పించింది. ఈ ఏడాది అజయ్ దేవగన్ భోళా చిత్రంతో మళ్లీ పలకరించింది. అమలాపాల్ ఒక్క తెలుగు మలయాళం లోనే కాకుండా తమిళ్ ,కన్నడ భాషలో కూడా నటించింది.
నిన్నటి రోజున 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఇందులో విశేషం ఏంటంటే.. తన బాయ్ ఫ్రెండుని రెండో పెళ్లి చేసుకోబోతోందట. తన ప్రియుడైన జగత్ దేశాయ్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్స్టాల్ లో ఒక వీడియోను షేర్ చేసింది.. అదేంటంటే తను తన బాయ్ ఫ్రెండ్ కలిసి డాన్స్ చేసింది.. అలాగే అమలాపాల్ కి జగత్ మోకాళ్లపై కూర్చొని లవ్ ప్రపోజ్ చేసిన వారిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్న వీడియోలు షేర్ చేయటంతో అది సోషల్ మీడియా వైరల్ గా మారుతోంది.
జగత్ దేశాయ్ తన ఇన్స్టాల్ లో ఇలా రాశాడు. నా స్వీటి సుందరి నా లవ్ కి ఓకే చెప్పింది హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ క్యాప్సిల్ ఇచ్చాడు. ఇది చూసిన అమలాపాల్ అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.ఇంతకుముందే డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ ను పెళ్ళాడి విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే . ఇప్పుడు మళ్లీ తన ప్రియుడు అయిన జగత్ ని రెండో పెళ్లి చేసుకొని ఇంకెన్నో సినిమాల్లో అమలాపాల్ నటించాలని వారి అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.
అమలాపాల్ కెరీర్ విషయానికొస్తే మొట్టమొదటిగా మలయాళం లో నటించి ఆ తరువాత పలు భాషలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. పలు రకాల లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.