నగ్నంగా నటించిందుకు ఓవైపు మహిళా సంఘాల నిరసనలు, మరో వైపు పోలీసులకు పిర్యాదు నడుమ ఎట్టకేలకు అమలాపాల్ సినిమా ఆమే విడుదల అయింది. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో అసలు అమలాపాల్ ఎందుకు నగ్నంగా నటించింది అనే కథను ప్రేక్షకులు ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు అమలాపాల్ నటనపై ఓ లుక్కేద్దాం.
సూపర్ బ్యూటీ అమలాపాల్ ఆమే సినిమాను ఈ రోజు థియోటర్లలో విడుదల చేశారు. ఒంటిపై నూలు పోగులేకుండా ఎంతో దైర్యంతో నటించిన అమలాపాల్ సినిమా విడుదలకు ముందే అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. అడ్డంకులను అధిగమించి సినిమాను ఎట్టకేలకు విడుదల చేశారు. ఆమే సినిమా టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియోట్ చేసింది. టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులు థియోటర్లకు క్యూకట్టారు.
సినిమా పరంగా చూస్తే అమలాపాల్ కామిని పాత్రలో నటించింది. ఆధునిక భావాలున్న కామిని ఓ రోజు తన స్నేహితులతో కలిసి మందేసి చిందేస్తుంది. ఎంజాయ్ చేసే కామిని ఓ రోజు ఫుల్గా మందేసి ఇంటికి తిరిగిరాదు. అయితే మద్యం మత్తులో ఉన్న కామినికి మత్తు దిగిపోగానే ఓ పాడుబడిని బంగ్లాలో ఉంటుంది. ఆ పాడుబడిని బంగ్లాలో ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంటుంది. కామినితో తాగి ఆడిపాడిన స్నేహితులు ఏమయ్యారు..? ఆ పాడుబడిన బంగ్లాలోకి కామిని ఎలా వచ్చింది..? అక్కడ ఒంటిపై బట్టలు లేకుండా ఉండటానికి కారణం ఏమిటి…? అసలారోజు అక్కడ ఏమి జరిగింది…? కామిని ని పోలీసులు ఒంటిపై బట్టలు లేకుండా చూసి ఎలా షాకుకు గురయ్యారు…? తరువాతేం జరిగింది…? కామిని నగ్నత్వం అవడానికి గల కారణాలు ఏంటీ అనేది తెరపై చూడాల్సిందే…
ఇక అమలాపాల్ తన నగ్నత్వంలో నటించి, మెప్పించిందనే చెప్పొచ్చు. ఓ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. అమలాపాల్ నటించిన తీరు, తన లో దాగిన ప్రతిభను ఈ సినిమాలో చూపించింది. ఇక ప్రేక్షకులు ఏదైతే ట్రైలర్లో చూసి సినిమాకు వచ్చారో అది పూర్తిగా నెరవేర్చింది అమలాపాల్. థియోటర్ లోకి వెళ్ళిన ప్రేక్షకులకు తెరపై మనస్సును నిమగ్నం చేయించడంలో అమలా పూర్తిగా విజయవంతం అయిందనే చెప్పొచ్చు. ఇక దర్శకుడు రత్నకుమార్ కూడా సినిమాను నడిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ సినిమా మొత్తానికి ఓ కమర్షియల్ హిట్ సాధించనట్లే లెక్క.