అమలాపాల్ సంస్కృతి, సంప్రదాయాలను బాగా పాటించే హీరోయిన్ అన్న ఇమేజ్ సొంతం చేసుకుంది. ఎప్పుడూ చీర కట్టు, బొట్టుతో సంప్రదాయాల బోర్డర్ క్రాస్ చేయని అమల ఆమె తాజా సినిమా అడై (తెలుగులో ఆమె) టీజర్‌లోనే అందరి ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా చేసింది. టీజర్‌లో కంప్లీట్ న్యూడ్‌గా నటించిన అమల ఆ ఒక్క వీడియోతో సినిమాకు ఫుల్ మార్కెట్ వచ్చేలా చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది.
ఇక సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమాను తెలుగులో `ఆమె` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే అమల అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో ఆమె శరీరం మీద కీలక పార్ట్‌లకు మినహా మిగిలిన భాగం పూర్తి నగ్నంగానే కనిపిస్తోంది. ఏదో ఘర్షణతో ఎవరో ? ఆమెను హింసిస్తున్న టైంలో ఆమె ప్రతిఘటించే క్రమంలో ఆమె చాలా సహజంగా కనిపిస్తోంది.
పైన చిన్న పిల్ల గుడ్డపేలికలు మినహా ఆమె మిగిలిన బాడీ అంతా నగ్నంగానే ఉంది. ఒంటి మీద రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే శారీరక హింసకు గురైన అమ్మాయిగా అమల ఈ సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది. ఏదేమైనా మేజర్, స్టిల్స్‌తోనే ఆ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తూ నానా రచ్చ రచ్చ చేస్తోంది. తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమల ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు.
ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్‌ను పెళ్లి చేసుకొని ఆ వెంటనే విడాకులు ఇచ్చిన ఆమె లాంగ్ గ్యాప్‌తో ఇప్పుడు ఎవరు ఊహించని కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తోంది. విచిత్రం ఏంటంటే చిత్ర నిర్మాణానికి చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వ్యక్తి ఈ సినిమా హక్కులు కొనడంతో తెలుగులో ఈ సినిమా మరింత సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.