నీ కుటుంబాన్ని పోషించుకో, అభిమాని కి అల్లు శిరీష్ షాక్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ ” 20 ఏళ్ల నుండి విండోస్ ఉన్న ల్యాప్ టాప్ నే వాడుతున్న..ఇప్పుడు మొదటి సారి ఆపిల్ మాక్ ఓ ఎస్ ల్యాప్ టాప్ ని వాడబోతున్న…ఇక ఈ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ కి ధన్య వాదాలు అని ట్వీట్ చేసారు అల్లు శిరీష్.

ఈ ట్వీట్ కి ఒక అభిమాని రిప్లై చేస్తూ ” అన్న నాకు ఒక చిన్న ల్యాప్ టాప్ గిఫ్ట్ గా ఇవ్వు అన్న, నాకు ఫ్యామిలీ ఉంది జీతం కూడా తక్కువ, నేను కొనాలి అంటే ఒక 3 సంవత్సరాలు పడుతుంది. నేను చేసే ఉద్యోగం లో ల్యాప్ టాప్ వినియోగం చాల ఎక్కువగా ఉంటుంది. కానీ నా దగ్గర ఇప్పటి వరకు ల్యాప్ టాప్ లేదు, నేను మీకు మరియు అల్లు అర్జున్ గారికి పెద్ద ఫ్యాన్ ని అని ట్వీట్ చేసారు సదరు అభిమాని.
ఈ ట్వీట్ కి శిరీష్ ” అయ్యో నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వు సంపాదించిన డబ్బుతో మంచిగా నీ కుటుంబాన్ని పోషించుకో. నా దగ్గర ఎలాగో కొత్త ల్యాప్ టాప్ ఉంది కనుక నువ్వు నా సోనీ ల్యాప్ టాప్ తీసుకో, నాకు డైరెక్ట్ మెసేజ్ పంపు” అని సమాధానం ఇచ్చారు.

ఒక అభిమాని కి ఇంత కంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది. అది కూడా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక వ్యక్తికి అల్లు శిరీష్ చేస్తున్న ఈ సహాయం నిజంగా గొప్పదే అని చెప్పాలి.

 

Share.