ఆ పని చేయొద్దంటూ అల్లు శిరీష్ సంచలన ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటుడు అల్లు శిరీష్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా తన అభిమానులకే కాకుండా అందరికి ఒక మెసేజ్ పంపారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ” ఇన్విజిబుల్ కిడ్ ప్రాంక్ ” ( కనపడకుండా చిన్న పిల్లలని సరదాగా బయపెట్టటం) అనే ఒక ఛాలెంజ్ ట్రెండ్ అవుతుంది. ఈ ఛాలెంజ్ లో పెద్ద వారు కనపడకుండా చిన్న పిల్లల్ని సరదాగా బయపెట్టాలి. అప్పుడు పిల్లలు భయంతో ఏడుస్తుంటే అది చూసి పెద్ద వారు సరదాగా ఒక ఫోటో తీసి నవ్వుకుంటారు. ఇందులో అంత సరదా ఏముంది? ఈ ట్రేండింగ్ ఛాలెంజ్ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది, ఇది నిజంగా చిన్న పిల్లల పట్ల ఎటువంటి ప్రేమ, దయ లేని వారు చేసే పని అని శిరీష్ ట్వీట్ చేసారు.

దయచేసి ఎవరు ఈ ఛాలెంజ్ ను చేయకండి, ఇతరులు కూడా ఈ ఛాలెంజ్ చేసే విధంగా ఎవరిని ప్రోత్సహించకండి అంటూ అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా అందరికి తెలియచేసారు. శిరీష్ చేసిన ఈ మెసేజ్ కి పలువురు అతన్ని ప్రశంసించారు. అన్న మీరు సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయటం విశేషం. చిన్న పిల్లల పట్ల అల్లు శిరీష్ చూపిన శ్రద్ధ కి హ్యాట్స్ ఆఫ్.

 

Share.