అల్లు శిరీష్ కుటుంబానికి దూరంగా ఉండడానికి కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య ఫ్యామిలీకి ఎంత ఇమేజ్ ఉందో చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్రను వేసుకున్నారు.అల్లు రామలింగయ్య గారి వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ అల్లు అరవింద్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగిస్తున్నారు.. ఇక అల్లు అరవింద్ కుమారులు.. అల్లు అర్జున్ ,అలాగే అల్లు శిరీష్ వీరు కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారే..అయితే అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో లెవెల్ కి ఎదిగాడు.

Allu Arvind Wiki, Age, Wife, Children, Family, Caste, Biography & More -  BigstarBio
కానీ అల్లు శిరీష్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఎప్పటినుంచో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్ కి బన్నీ ఒక్కడే అన్నట్టు కొంతమందికి కామెంట్లు చేస్తున్నారు. అసలు ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలను చేసిన అల్లు శిరీష్ మళ్లీ కనిపించటం లేదు. ఏదైనా తన ఫ్యామిలీఫంక్షన్లో కానీ శుభకార్యలలో కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా అల్లు శిరీష్ కనిపించలేదు.

అయితే ఒకానొక సందర్భంలో అల్లు అరవింద్, అల్లు శిరీష్ ల మధ్య వార్ జరిగిందని ఇంట్లో నుంచి పంపించేశారని అప్పట్లో కొన్ని కామెంట్స్ వినిపించాయి. అంతేకాకుండా తన మామ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నా కూడా అల్లు శిరీష్ రాలేదు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్, అల్లు శిరీష్ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి

ఇక అల్లు శిరీష్ ముంబైలో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అల్లు శిరీష్ ఇలా కావటానికి తన తండ్రి కారణమని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. బడ్జెట్ ఎక్కువ పెట్టి తన కొడుకుని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని దీంతో అల్లు శిరీష్ ఇంటి నుండి దూరంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో ఒక హీరోయిన్ని ప్రేమించిన కారణం చేత అల్లు అరవింద్ ఆ ప్రేమను నిరాకరించారని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share.