టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ అయన సతీమణి అల్లు స్నేహ ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా వారి ఇంట్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. కొద్దీ సేపటి క్రితమే అల్లు అర్జున్ తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా అల్లు అయాన్ శ్రీ కృష్ణుడి వేషధారణలో ఉన్న ఫోటో ఒకటి అభిమానులతో షేర్ చేసారు. దానికి క్యాప్షన్ గా ‘నా చిన్నారి కృష్ణులు ‘ అని రాసారు.
ఇక అల్లు స్నేహ కూడా తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా వారి కూతురు ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసి ‘ నా గోపిక ‘ అని క్యాప్షన్ జత చేసారు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ దంపతులు వారి క్లోజ్ ఫ్రెండ్ వెడ్డింగ్ సందర్భంగా బ్యాంగ్ కాక్ వెళ్లారని, అక్కడ వారు చేసిన సందడి డ్యాన్సులు, పాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అల్లు దంపతులు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో అందరిని ఆకట్టుకుంటున్నాయ్.
అల్లు అర్జున్ తదుపరి చిత్రం గురించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయన చివరగా నటించిన చిత్రం ” నా పేరు సూర్య”.