బాలయ్యే తన ఇన్స్పిరేషన్ అంటున్న బన్నీ..

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే….దానికి తగ్గట్టు హీరోలు మారిపోతారు. పాత్రకు అనుగుణంగా గెటప్ ఛేంజ్ చేస్తారు. అవసరమైతే ఎంతకష్టమైన బరువు కూడా తగ్గుతారు. అయితే మన తెలుగు హీరోలు బరువు తగ్గే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరు. ఆఖరికి యాభైలు దాటిన సీనియర్ హీరోలు సైతం బరువు తగ్గి తమ సత్తా ఏంటో చూపిస్తారు. టాలీవుడ్ హీరోల్లో బరువు గురించి పెద్దగా పట్టించుకొని హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే.

ఆయన ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోడు. కానీ సమయం వస్తే మాత్రం తప్పకుండా చేస్తారు. అందుకే బాలయ్య తన రూలర్ సినిమా కోసం కష్టపడి సుమారు 15 కేజీల బరువు తగ్గి కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నారు. ఆ సినిమా కోసం కూడా బాలయ్య మరో 10 కేజీలు తగ్గనున్నారంటా.

అయితే ఇదే విషయంలో ఈ సీనియర్ హీరోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలో అవుతున్నాడు. సినిమా సినిమాకు సరికొత్త గెటప్ లో కనిపించే బన్నీ…త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో మరో డిఫరెంట్ లుక్ కనిపిస్తున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన టీజర్, పోస్టర్‌లలో అల్లు అర్జున్ అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు. సరికొత్త స్టైల్ లుక్‌లో కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

ఈ విధంగా కనబడటానికి బన్నీ గట్టిగానే కష్టపడ్డాట. నా పేరు సూర్య సినిమా తరువాత కాస్త లావు అయిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా కోసం కేటోజెనిక్ అనే స్పెషల్ డైట్‌ను చేశాడట. ఈ డైట్‌ను నాలుగు నెలల పాటు ఫాలో అయిన బన్నీ, దాదాపు 14కిలోలు తగ్గాడట. దీనికోసం బన్నీ ఫిట్‌నెస్ కోసం ఓ ట్రైనర్‌ను కూడా పెట్టుకున్నాడట. ఈ గెటప్ లో కనిపించడం కోసం రోజూ రెండు గంటల పాటు కష్టపడ్డాట. అలాగే హెయిర్‌ను కూడా కట్ చేయకుండా పెంచుకుని, న్యూ హెయిర్ స్టైల్ వచ్చేలా చేశాడు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న అల వైకుంఠపురంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న, 2020లో విడుదల అవుతుంది. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Share.