ప్రియమణి పై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఢీ షోకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే జడ్జ్, ప్రియమణిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు బన్నీ.ఈ షో హోస్ట్ ప్రదీప్ అల్లు అర్జున్ తో ప్రియమణి, పూర్ణ లను చూపిస్తూ ఈ అందమైన లేడీ జడ్జిలకు ఒక స్పెషాలిటీ ఉంది సార్ అని చెప్పగానే.. ఏంటది అని అంటాడు బన్నీ. వెంటనే ప్రదీప్ ప్రియమణి గారు బాగా డాన్స్ చేస్తే హగ్ ఇస్తారని చెప్పారు.

అనంతరం పూర్ణ గారు అయితే డాన్స్ బాగా చేస్తే బుగ్గ కొరుకుతారు అనగానే.. అప్పుడు అల్లు అర్జున్ ఇంకా బాగా డాన్స్ చేస్తే ఇంకేం చేస్తారో అంటూ తనదైన శైలిలో కామెంట్ చేయగా అక్కడున్నవారంతా పగలబడి నవ్వేశారు. ఇక ఆ తరువాత బన్నీతో ప్రియమణి మీతో వర్క్ చేయలేదని నాకు చాలా బాధగా ఉంది బన్నీ అని అనగానే.. అలా అనుకోవద్దు అని ఇప్పటికీ ఇంకా ఛాన్స్ ఉంది అని తెలిపాడు బన్నీ.

మీతో ఎప్పుడైనా వర్క్ చేస్తానని పైగా ఇప్పుడు ఇంకా సన్నబడి హాట్ గా తయారయ్యారు అంటూ బన్నీ అనడంతో ప్రియమణితో సహా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియమణి పై అల్లు అర్జున్ వేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Share.