అరుదైన గౌరవం అందుకున్న అల్లు అర్జున్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో అల్లు అర్జున్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతో తాజగా ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. దుబాయ్ షేక్ ల నగరంలో భారతీయ నటుల్లో ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. కానీ ఇది చాలా కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అందులో ఒకరు అల్లు అర్జున్ ఈయకి గోల్డెన్ వీసాను దుబాయ్ ప్రభుత్వం మంజూరు చేయటం అరుదైన గౌరవం అందుకున్నారు..ఈ తీపి కబురును బన్నీ అభిమానులతో పంచుకున్నాడు.

Allu Babloo AADHF (@allubabloo) / Twitter

ఇప్పుడు దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న కిక్కులో ఉన్న బన్నీ తదుపరి పుష్ప-2 కొత్త షెడ్యూల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వెళ్తున్నారు. పుష్ప 2 చిత్రం గత డిసెంబర్లో సెట్ పైకి వెళ్ళింది.ఈ సినిమాని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు.ఈ చిత్రాన్ని వైజాగ్ లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ శుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్ తన టీం తో కలిసి వైజాగ్లో అడుగు పెడతారని తెలిసింది.

P U S H P A - The Rule 🦁 (@Venkat_aadhf) / Twitter

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మొదటి భాగం కంటే రెండో భాగాన్ని మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ఆసక్తితో ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుష్ప-2 లో మలయాళ నటుడు కీలకపాత్రను పోషించనున్నారు. పుష్ప సినిమాలో ఫారెస్ట్ లోని ఎక్కువగా తెరకెక్కించారు.. ఇప్పుడు అదే రేంజ్ లో పుష్ప-2 సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ ఎపిసోడ్ మరో రేంజ్ లో ఉంటాయని సమాచారం.ఎర్రచందనం స్మగ్లింగ్ ను పరాకాష్టలు చూపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప-2 సినిమా 2024లో పాన్ ఇండియా కేటగిరిలో థియేటర్లలో విడుదలకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

Share.