పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన అల్లు అర్జున్ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ పెద్దగా బయట ఎక్కువగా కనిపించరని చెప్పవచ్చు. ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా పాపులర్ పొందడంతో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం పుష్ప-2 చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది.
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తన భార్య స్నేహారెడ్డికి కూడా అంతే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అయితే స్నేహ రెడ్డి మాత్రం ఈ మధ్యకాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే స్నేహారెడ్డి తన ఫోటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటోంది. ఈ ఫోటోల పైన అల్లు అర్జున్ సీరియస్ అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్నేహ రెడ్డి ఫోటోల పైన కూడా సోషల్ మీడియాలో పలు రకాలుగా నెగిటివ్ కామెంట్లు రావడంతో.. అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ఇలాంటి ఫోటో షూట్ నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై స్నేహ రెడ్డి ఎదిరించినట్లుగా కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మాత్రం తన పైన వస్తున్న వల్గర్ కామెంట్స్ వల్ల చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. కావాలని బన్నీ అంటే పడని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ జంట మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి పోస్టుల వల్ల పలు రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి మరి.