కన్నడ రిపోర్టర్ కి సారీ చెప్పిన బన్నీ.. ఎందుకో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప.ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఇందులో భాగంగా ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. దీనితో విడుదలకు మరొక రెండు రోజులే సమయం ఉండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ నువేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరు లో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో ఒక ఊహించని బన్నీ కి పరిణామం ఎదురయ్యింది. ప్రెస్ మీట్ చెప్పిన టైమ్ కి రాకుండా ఆలస్యంగా ఎలా వచ్చారు అంటూ కన్నడ రిపోర్టర్ బన్నీ నీ నిలదీశాడు .

11:15 అని చెప్పి 1:15 ఎలా వస్తారు అంటూ బన్నీ రష్మీక లపై ఒక రిపోర్టర్ ఫైర్ అయ్యాడు. అప్పుడు అల్లుఅర్జున్ క్షమాపణలు చెప్పి పొగమంచు కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యం అయిందని, అంతేకాకుండా ప్రెస్ మీట్ టైమింగ్ పై తనకు స్పష్టత లేదని చెప్పుకొచ్చాడు. అలాగే సారీ చెబితే మనిషి పెరుగుతాడు కానీ తగ్గదు అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పిన విధానం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share.