సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమాలో మహేష్ తర్వాత అంత ఇంపార్టెంట్ రోల్ స్క్రీన్ స్పేస్ తీసుకున్న హీరో అల్లరి నరేష్. ఈమధ్య సరైన సినిమాలు పడక కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న అల్లరోడికి మహర్షి సూపర్ బూస్టింగ్ ఇచ్చినట్టు చెప్పొచ్చు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మే 9 అంటే నిన్న గురువారం మహర్షి రిలీజ్ అవగా సరిగ్గా 17 ఏళ్ల క్రితం మే 10 అంటే ఈరోజు శుక్రవారం అల్లరి సినిమాతో నరేష్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. అంటే హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు 17 ఏళ్ల తర్వాత ఆ డేట్ కు ఒకరోజు ముందు మళ్లీ తనని నటుడిగా చేసింది మహర్షి.
మహర్షి సినిమాలో నటించినందుకు తనకు చాలా మంది నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని.. సినిమాలో మహేష్ తో నటించడం చాలా గొప్పగా భావిస్తున్నా అంటూ.. ఈ 17 ఏళ్ల కెరియర్ లో తన వెంట ఉండి నడిపించిన దర్శకులు, నిర్మాతలు, స్నేహితులు, చుట్టాలు అందరిని తన కృతజ్ఞతలు తెలియచేశాడు అల్లరి నరేష్. చూస్తుంటే అల్లరోడికి మళ్లీ మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. ప్రస్తుతం బంగారు బుల్లోడు సినిమా చేస్తున్న అల్లరి నరేష్ వరుస సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
హీరోగా 50కు పైగా సినిమాలు చేసినా అల్లరి నరేష్ స్పెషల్ క్యారక్టర్స్ చేసిన సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. గమ్యంలో గాలి శీను పాత్ర సంచలనం కాగా.. శంభో శివ శంభోలో పాత్ర హిట్ అయ్యింది. ఇక మహర్షిలో రవి పాత్రకు ప్రాణం పోశాడు అల్లరోడు. మొత్తానికి హీరోగా కామెడీ సినిమాలు చేస్తూనే నటుడిగా తన సత్తా చాటుతున్న అల్లరి నరేష్ కు ఇక నుండి కెరియర్ లో మంచి సక్సెస్ లు రావాలని ఆశిద్దాం.
From the bottom of my heart…. 🙏🏼 pic.twitter.com/DDC8EVASU5
— Allari Naresh (@allarinaresh) May 10, 2019