నాగ చైతన్య హీరోగా నటించిన ఒకలైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూజా హెగ్డె ఆ సినిమాతో పెద్దగా విజయం అందుకోలేక పోయింది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ముకుంద సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు.
దాంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అక్కడ కూడా సక్సెస్ కాలేక పోయింది. ఇక లాభం లేదనుకొని మళ్లీ తెలుగు సినీ పరిశ్రమవైపే చూసింది. అదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడజగన్నాధం సినిమాలో నటించింది. ఈ మూవీ బాగానే ఆడింది కానీ అది చేసిన బిజినెస్ తో పోల్చుకుంటే హిట్టేమీ కాదు అలా దువ్వాడ మిస్ అయ్యింది హిట్ ఖాతాలోంచి .
ఇక ఇప్పుడేమో మహేష్ బాబు తో మహర్షి చిత్రంలో నటించింది . కథ బాగుంది కానీ చాలామంది పెదవి విరుస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకు సూపర్ హిట్ అవుతుందో..మరో రెండు మూడు రోజులు ఆగితే కానీ తెలీదు . దాంతో ఈ భామకు సాలిడ్ గా బ్లాక్ బస్టర్ పడే యోగం ఉందా ? అన్న అనుమానం నెలకొంది