టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు..స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం . ఈ చిత్రం వచ్చేనెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,హిందీ ,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల కాబోతోంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. పారానిక ప్రేమ కావ్యం శాకుంతలం. ప్రతి ప్రేమను కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇదివరకే విడుదలైన ట్రైలర్, టీజర్ పాటలు పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున కూడా చేస్తున్నారు. ఇందులో మలయాళం యాక్టర్ దేవ్ ,మోహన్ బాబు, సచిన్ కేడుకర్ ,మధుబాల ,ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ, వర్షిని తదితరులు ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. తాజాగా శాకుంతలం సినిమాకు సంబంధించి సమంత గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే పారాణిక చిత్రం అయినా ఈ సినిమాలో సమంత ధరించిన నగలు చీరలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
సమంత క్యారెక్టర్ కోసం హైదరాబాద్ కి చెందిన వసుంధర డైమండ్ రూఫ్ వారు ప్రత్యేకంగా కొన్ని నగలను కూడా డిజైన్ చేశారట. ఆమె ధరించిన నగలధర ఏకంగా రూ.93 కోట్ల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం ఏకంగా సమంత 30 కిలోల బరువు ఉండే ఒక చీరను కూడా కట్టుకున్నట్లు తెలుస్తోంది ఆ చీరతో ఏడు రోజులపాటు షూటింగ్ జరిగినట్లు సమాచారం ఇప్పుడు ఈ విషయం తెలుగు ఫిలిం సర్కిల్స్లో బాగా వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.