‘ అల వైకుంఠ‌పురంలో ‘ టీజ‌ర్‌… బ‌న్నీ కొడుకు స్టెప్పే హైలెట్ (వీడియో)

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న అల వైకుంఠ‌పురంలో సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబోలో ఇప్ప‌టికే వ‌చ్చిన జులాయి – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు రెండు హిట్ అవ్వ‌డంతో ఈ సినిమా హిట్ అయ్యి వీరి కాంబోలో హ్య‌ట్రిక్ అవుతుంద‌ని అంద‌రూ అంచ‌నాల్లో ఉన్నారు. ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో సినిమా మేక‌ర్లు చేస్తోన్న ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ అయ్యాయి.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌ణ సాంగ్ అయితే తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ్యూస్ రాబ‌ట్టిన సాంగ్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఈ సినిమా వ‌స్తోన్న హైప్‌కు ఈ సాంగ్ మెయిన్ ఎట్రాక్ష‌న్‌. ఇక రాములో రాములా … న‌న్ను ఆగ‌మాగం చేసినావురో సాంగ్ కూడా యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. తాజాగా గురువారం ఈ సినిమాలో మూడో సాంగ్ ఓ మై గాడ్ డాడీ టీజ‌ర్ రిలీజ్ అయ్యింది.

ఈ టీజ‌ర్ సినిమాపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న హైప్‌ను మ‌రింత పీక్స్‌కు తీసుకు వెళ్లింది. టీజ‌ర్లో బ‌న్నీ కొడుకు అయాన్‌, కూతురు అహాన్ తండ్రి ఫొటో చూస్తూ త‌ల‌బాదుకోవ‌డంతో పాటు చివ‌ర్లో బ‌న్నీ కొడుకు వేసిన స్టెప్ మూమెంట్ అయితే ఇర‌గ‌దీసింది. ఈ స్టెప్ చూస్తుంటే నా పేరు సూర్య సినిమాలో బ‌న్నీ వేసిన క్యాప్ స్టెప్ స్టైల్‌ను గుర్తు చేసిన‌ట్లుంది.

ఏదేమైనా ప్ర‌తి ప్ర‌మోష‌న్ వీడియో సినిమాపై హైప్ పెంచేస్తోంది. ఇక అదే రోజున మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు పోటీగా రిలీజ్ అవుతుండ‌డంతో అల వైకుంఠ‌పురం టీం ప‌క్కా స్ట్రాట‌జీతో ముందుకు వెళుతోంది.

Share.