స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంఠపురంలో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ హీరోయిన్ టబు, బోమన్ ఇరానీ, జయరామ్, సత్యరాజ్, సుశాంత్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు.
ఇక త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ క్రేజ్ ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ గత సినిమాలకు సైతం ఓవర్సీస్‌లో అదిరిపోయే రేంజ్‌లో వసూళ్లు వచ్చాయి. దీంతో ఓవర్సీస్‌లో త్రివిక్రమ్ సినిమాలకు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతుంది.
ఈ క్రమంలోనే అలా వైకుంఠపురంలో విదేశీ హక్కులు రికార్డు రేట్లకు అమ్ముడవుతున్నాయి. అలా వైకుంఠపురంలో విదేశీ హక్కులు రూ 8.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ రేటు అంటే మామూలు విషయం కాదు. హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌కు రెడీగా ఉంది.