స్పైడర్ మూవీ ఫలితంతో ఊహించని షాక్ తిన్న మహేష్ భరత్ అనే నేను సినిమాతో విజయాల బాట పట్టారు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహం తర్వాత మహేష్ కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. శ్రీమంతుడు హిట్ తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ ఇచ్చిన షాకులతో మహేష్ చాలా రోజుల వరకు కోలుకోలేని పరిస్థితి. ఆ తర్వాత భరత్ ఇచ్చిన ఉత్సాహంతో వెంటనే మహర్షితో మరో హిట్ కొట్టాడు.
ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ మూవీ తో హ్యాట్రిక్ హిట్ కి సిద్దమైన మహేష్, ఈ మూవీ విజయ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థం అవుతుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే అదే రోజు బన్నీ – త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో కూడా రిలీజ్ అవుతోంది.
ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు అంటే బాక్సాఫీస్ హీటెక్కడం ఖాయం. థియేటర్ల కొరత… ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు ఇలా చాలానే నడుస్తుంటాయి. ఈ ఇద్దరు హీరోలు పంతానికి పోయి మరీ గంట గ్యాప్లోనే తమ సినిమాలు జనవరి 12న రిలీజ్ అవుతున్నట్టు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఎవ్వరూ వెనక్కి తగ్గేలా లేరు. మహేష్ సినిమాకు దిల్ రాజు థియేటర్లు చూస్తున్నారు. బన్నీ సినిమాకు అల్లు అరవింద్ ఉండనే ఉన్నారు
ఇక ఇన్నర్ టాక్ ప్రకారం మహేష్ సరిలేరు నీకెవ్వరు బ్టాక్ బస్టర్ అంటున్నారు. ఆ సినిమాకు మంచి ఎడ్జ్ ఉందని తెలుస్తోంది. మరి బన్నీ సినిమా టాక్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది. బన్నీ ఏ కాన్ఫిడెంట్‌తో మహేష్ సినిమాతో పోటీకి వెళుతున్నాడు ? బన్నీకి కూడా తన సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ ఉందా ? మరి ఈ పోరులో ఎవరి సినిమా పై చేయి సాధిస్తుందో ? చూడాలి.