ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా బయో పిక్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘సంజూ’ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా క్రిష్ దర్శకత్వంలో కంగనా రౌనత్ హీరోయిన్ గా నటిస్తున్న ‘ మణికర్ణికా ‘ వీర నారి ‘ రాణి లక్ష్మి బాయ్ ‘ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పుడు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నిజ జీవితాన్ని కూడా బయోపిక్ రూపం లో నిర్మిస్తున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర లో ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ మరియు నటుడు పరేష్ రవెల్ కనిపించనున్నారని బాలీవుడ్ మీడియా అప్పుడే పలు వార్తలు ప్రచురించారు.
అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ఇద్దరు ఎవరికీ వారే సాటి మరి ఇద్దరిలో ఈ అద్భుత అవకాశం ఎవరికీ దక్కుతుందో మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ బయోపిక్ లో మోడీ పాత్ర చేయనున్న హీరో ఎంపిక పూర్తిగా పార్టీ హై కమాండ్ చేతుల్లోనే ఉందని సమాచారం, చూద్దాం వారు ఎవరిని ఎంపిక చేస్తారో.