ఈ మద్య జనాలు ప్రేమ కథా చిత్రాలు,యాక్షన్ చిత్రాలు చూసి బోర్ ఫిల్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువగా హర్రర్, కామెడీ, థ్రిల్లర్ మూవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూవీ మేకర్స్ కూడా అలాంటి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా నందితా శ్వేత లీడ్ రోల్ నటిస్తున్న ‘అక్షర’ చిత్రం పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు బి.చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే… వయసు మీద టిక్ టాక్ లతో ఎంజాయ్ చేస్తున్న అజయ్ ఘోష్ తో పోరంబోకుగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు షకలక శంకర్, సత్య,మధునందన్ పరిచయం అవుతారు. అదే సమయానికి ఆ ఊరికి టీచర్ గా అక్షర్ (నందిత శ్వేత) వస్తుంది.
ఆమెపై మనసు పడేసుకున్న ఈ గ్రూప్ కిడ్నాప్ చేస్తారు..ఆ తర్వాత ఏం జరిగింది..కథలో ఎన్నో ట్విస్ట్ లు, సస్పెన్స్ కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు కామెడీ సినిమాకు మంచి ప్లస్ అవుతుందట. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.