సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇస్తూ స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. కొంతమంది హీరోయిన్లు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వారు ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని మేనకోడలు సుప్రియ కూడా ఒకరు. ఈమె నటుడు చరణ్ రెడ్డిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. చరణ్ రెడ్డి మొదట శ్రీయ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇష్టం సినిమాలో హీరోగా నటించారు.
చరణ్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం లో జన్మించారు. అప్పట్లో రామోజీరావు కొత్త వాళ్లకి అవకాశం ఇస్తున్న సమయంలో ఇష్టం సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఆ తర్వాత కొన్ని సినిమాలలో మాత్రమే నటించారు చరణ్ రెడ్డి. సుప్రియ మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
వీరిద్దరూ ప్రేమించుకొని వివాహం చేసుకున్నాక చాలా రోజులు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. కానీ ఏమైందో ఏమో కొన్ని విషయాలలో తరచూ ఇద్దరికీ గొడవలు జరిగేవని వార్తలు గతంలో వినిపిస్తూ ఉండేవి.. అందుచేతనే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగిందట. అయితే వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు సుప్రియ తరచూ చరణ్ రెడ్డితో గొడవ పెట్టుకునేదట..అంతేకాకుండా ఒకవైపు సినిమాలలో అవకాశాలు రాక ఇటు భార్యతో గొడవలు పడడం వల్ల మానసిక ఒత్తిడితో మద్యానికి బానిసై తాగి చివరికి తన శరీరంలో అన్ని అవయవాలు పాడు చేసుకున్నాడు చరణ్ రెడ్డి.
సుప్రియ గొడవలు భరించలేక ప్రతిరోజు తాగి ప్రాణాల మీదికి తెచ్చుకొని మరణించినట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. అయితే చరణ్ రెడ్డి మరణించేవరకు ఈమె అక్కినేని కోడలు సుప్రియ భర్త అనే విషయం తెలియదట. చరణ్ రెడ్డి అభిమానులు మాత్రం సుప్రియ వల్లే డిప్రెషన్ కి వెళ్లి మందు తాగి చనిపోయారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.