సమంత – నాగ చైతన్య తో విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించిన తర్వాత వేరు వేరు బంగ్లాలు తీసుకుని నివసిస్తున్నారు. ఇకపోతే సినిమాలలో స్టార్ పొజిషన్ ను చేరుకోవడానికి ఇద్దరు కూడా శాయశక్తుల ప్రయత్నిస్తూ విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత విడాకులు ప్రకటించిన తర్వాత మొదటిసారి అక్కినేని కాంపౌండ్ లో అడుగు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆమెకు అక్కడ ఏం పని.. ఎందుకు అక్కినేని కాంపౌండ్లో అడుగు పెట్టింది.. అనే విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈమె కీలక పాత్ర పోషిస్తోంది. షూటింగ్ పనులు కంప్లీట్ చేసి డబ్బింగ్ పనుల కోసం అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లిందని సమాచారం.అయితే ఈమె అన్నపూర్ణ స్టూడియో ముందు కారు నుంచి దిగి ముసుగు వేసుకొని రహస్యంగా తన పని చేసిందని సమాచారం. అంతేకాదు పర్సనల్ గా కాకుండా ప్రొఫెషనల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ ను విజిట్ చేసిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతున్నాయని , అందుకే ఆమె అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది.