అక్కినేని అభిమానులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది..ఎందుకంటే దీపావళి సందర్భంగా అక్కినేని అభిమానులు ఈ విషయం తెలుసుకొని తెగ సంబరపడిపోతున్నారు. అక్కినేని అఖిల్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని అది కూడా ఒక బిజినెస్ మ్యాన్ మనవరాలు తో వివాహం జరగబోతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా అఖిల్ ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరగడం జరిగింది.. త్వరలోనే వివాహం జరగాల్సి ఉండగా మధ్యలో ఆగిపోయింది.ఇక నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే విడిపోవడం జరిగింది.
దీంతో అక్కినేని కుటుంబానికి పెళ్లి పెద్దగా కలిసి రాలేదని విషయం తెలుసుకొని నాగార్జున కాస్త డిప్రెషన్ కి గురయ్యారు .అంతేకాకుండా తమ ఇద్దరు కుమారులు ఇండస్ట్రీలో హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో కూడా నాగార్జునకు కాస్త వెలితిగా కనిపిస్తోందట.. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని అది కూడా ఇండియాలోనే ఒక టాప్ బిజినెస్ కుటుంబం నుంచి ఆయన మనవరాలిని వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.
అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే అఖిల్ ఆమెను గత కొద్దిరోజుల్లో నుంచి ఆమెతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వీరిద్దరి అభిప్రాయాలు కుదిరితే అది పెళ్లి వరకు వెళ్లబోతోందని సమాచారం ఒక ప్రైవేటు పార్టీలో ఆ అమ్మాయిని కలవడం జరిగిందట. దీంతో అప్పటినుంచి ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఒకరినొకరు బాగా తెలుసుకొని ఈ విషయాన్ని ఇంట్లో తెలియజేయడంతో వీరి వివాహ బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. అమలా కూడా ఈ విషయం తెలిసి కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతున్నది.