పెళ్లి పీటలెక్కనున్న అఖిల్.. అక్కినేని కొత్త కోడలు ఎవరంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని అఖిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా అమ్మాయిలలో ఈయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. యంగ్ హీరోలలో ఎవరికి లేని ఫాలోయింగ్ ఆయన సొంతం. ఎప్పుడూ కూల్ గా.. స్టైలిష్ లుక్స్ లో క్లాస్ గా అందరిని తన వైపు తిప్పుకునే అఖిల్ ఎప్పటికప్పుడు హ్యాండ్సమ్ లుక్ లో అందర్నీ అలరిస్తూ ఉంటారు.. అందుకే చాలామంది అఖిల్ అంటే మంచి ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం తన దృష్టినంతా క్రికెట్ అలాగే సినిమాల మీద పెట్టాడు. అఖిల్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం అనే విషయం అందరికీ తెలిసిందే.

ఒకసారి క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ లోకి దిగాడంటే ఇక సర్వం మర్చిపోయి రఫ్ ఆడిస్తాడు. ప్రస్తుతం సిపిఎల్ మ్యాచ్స్ జరుగుతున్న నేపథ్యంలో గ్రౌండ్ లోకి దిగిన అఖిల్ అదరగొట్టేస్తున్నారు. దీంతో ఆడియన్స్ ఈయనను ఒక రేంజ్ లో పొగిడేస్తూ… మీరు క్రికెటర్ అయి ఉంటే ఇండియన్ టీం లో దుమ్ము దులిపేవారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఒక మ్యాచ్ లో అఖిల్ బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే ఆయనను చీరప్ చేస్తూ ఒక యంగ్ బ్యూటీ గ్రౌండ్లో కనిపించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఆమె ఎవరో కాదు ప్రణవి మనుకొండ.

అఖిల్ ను గ్రౌండ్లో ఒక రేంజ్ లో ఎంకరేజ్ చేస్తూ చీరప్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలను విజువల్స్ ను ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకోగా వీటిని చూసిన చాలా మంది గ్రౌండ్లో అఖిల్ ను ఎంకరేజ్ చేస్తూ అక్కినేని ఇంటి కోడలు అవ్వడానికి ట్రై చేస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది అఖిల్ కు ఈమె చాలా ఎక్కువ అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే మరికొంతమంది ఏకంగా త్వరలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కపోతున్నాడు. ఇద్దరి మనసులు ఒకటైతే అక్కినేని కొత్త కోడలు ఈమె అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

https://www.instagram.com/reel/CpQIp4NBtZ8/?utm_source=ig_web_copy_link

Share.