నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమా విడుదల అవ్వగానే మళ్లీ తన మొట్టమొదటి టాక్ షో ఆహా లో అన్ స్టాపబుల్ షో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. బాలకృష్ణ కెరియర్ లోనే మొట్టమొదటి టాక్ షో అని చెప్పవచ్చు. అయితే ఈ టాక్ షో కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. అయితే అ షో స్ట్రీమింగ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశారు అ షో మేకర్స్..అయితే ఈ షో ఎలా ఉంటుందో అంటూ.. బాలయ్య అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య అల్లు అర్జున్ ను ఇలా టాక్ షో తో మాట్లాడడం మొదటిసారి అని చెప్పవచ్చు.