నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ.ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటించింది. ఇందులో హీరోయిన్ పూర్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఇక హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటించారు. మరొక ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు కూడా నటించారు. డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా.
ఇక అందుకుగాను ఈ సినిమా మా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులతో తిరుమలకు వెళ్లారు బాలకృష్ణ. ఇప్పటికే బాలకృష్ణ వీరితో పాటుగా కనకదుర్గమ్మ ని కూడా దర్శించుకున్నారు. ఇక ఆ తర్వాత నరసింహస్వామి దేవాలయం కూడా సందర్శించారు. ఇక ఇప్పుడు తాజాగా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. నీకు ఈ సందర్భంగా తన సినిమా సక్సెస్ కు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు బాలక్రిష్ణ. ఇక ఈ ఏడాది ది హైయెస్ట్ గ్రాసర్ లో నిలిచింది అఖండ.