ఖండం ఓటీటీ రిలీజ్ డేట్.. ఎప్పుడంటే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ.. డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఇక కొంతమంది ముఖ్యమైన పాత్రలో నటించారు. డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే 85 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది అఖండ.

అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి పై ఒక విషయం బాగా వినిపిస్తోంది. ఓటిటి అగ్రిమెంట్ ప్రకారం.. సినిమా థియేటర్ లో విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకొనే విధంగా అగ్రిమెంట్ ఉంటుందట. కొన్ని సినిమాలు అయితే 20 రోజుల లోపలే విడుదల చేస్తాయి. ఎందుకంటే వీరికి కూడా భారీ లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ 30 రోజుల తర్వాత అఖండ మూవీ విడుదలవుతుంది అనుకుంటే..జనవరి-2 తారీకున విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాని డిస్నీ హాట్ స్టార్ లో తీసుకున్నట్లు తెలుస్తోంది.

Share.