నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు విడుదలై విషయం తెలిసిందే. రెండుతెలుగు రాష్ట్రాలలో బాలయ్య ఫాన్స్ థియేటర్ల వద్ద సందడి సందడి చేస్తున్నారు.సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల జై బాలయ్య అంటూ కేకలు, ఈళలు వేస్తూ సందడి సందడి గా చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక థియేటర్లు సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులకు ఒక చేదు సంఘటన ఎదురైంది.ఒక థియేటర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా ప్రేక్షకులు భయాందోళనతో పరుగులు తీశారు.
సంఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. వరంగల్ లో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూస్తుండగా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా థియేటర్లో పొగలు అలుముకున్నాయి. దీనితో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి ఆ మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సిఉంది. షార్ట్ సర్క్యూట్‌తో థియేటర్లు మంటలు చెలరేగినట్లుగా సమాచారం.