తాజాగా విడుదలైన అఖండ సినిమా ప్రేక్షకుల లో ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య బాబుతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, పూర్ణ ,నితిన్ మెహతా , శ్రీకాంత్ తదితరులు నటించిన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచారు.ఈ సినిమాలో నటించిన చిన్నారి దేస్ట గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
దేష్ఠ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కు సంబంధించిన పలు వివరాలను కూడా ఆయన వివరించారు. ఈ పాప ఎవరు ఎలా ఈ సినిమాకి తీసుకున్నారు అనే విషయానికి వస్తే.. ఇన్స్టాగ్రామ్ ద్వారా నిర్మాతలతో ఈ పాప కనెక్ట్ అయినట్లు సమాచారం. ఈ పాపను చూసి మంచి క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలిపారు. ఇకపోతే బాలయ్య ఈ పాప తో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నట్లు తెలిపారు . ఇక తమను కుటుంబ సభ్యులుగా చూసుకున్నట్లు… దేష్ట సినిమాలో చేసే ప్రతి సీను బాలయ్య చూసి అద్భుతమని అనేవారట. దేష్ట కూడా తను చేసిన ప్రతి సీను మానిటర్ లో చూసుకునేది అని అక్కడి వారు చెబుతున్నారు.
ఒక పాపకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు బోయపాటి కి , బాలయ్య తో నటించే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆ పాప తల్లిదండ్రులు. అంతేకాదు ఈ సినిమా వల్ల తమ పాపకు, తమకు ఎంతో మంచి పేరు వచ్చిందని దేష్ట తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.