ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి బాలయ్య హీరోగా చేసిన సినిమా అఖండ.. ఇక ఈ సినిమాతో వీరిద్దరు హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసి రికార్డు సృష్టిస్తోంది ఈ సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణకు తల్లి పాత్రలో నటించిన ఆమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఆమె ఎవరు ..ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బాలకృష్ణకు తల్లి పాత్రలో నటించిన ఆమె పేరు విజి. చంద్రశేఖర్. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆమె భర్త ఎయిర్ ఇండియాలో వెరీ సీనియర్ మోస్ట్ కెప్టెన్గా పనిచేసి రిటైరయ్యారని విజి చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇకపోతే ఇప్పటికి కూడా ఎయిర్ ఇండియా లోనే పనిచేస్తున్నట్లు.. కానీ నెలకు 12 రోజులు మాత్రమే పని చేస్తారు అని ఆమె వెల్లడించింది. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారిలో ఒకరు డాక్టర్ .. సైకాలజీ పూర్తి చేసి ఇప్పుడిప్పుడే తమిళ సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తోందని ఆమె వెల్లడించింది. ఇకపోతే ఈమె తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేనప్పటికీ .. తమిళ సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు సమయం కుదిరినప్పుడు ఇలా తల్లి పాత్రలో నటిస్తూ ఉంటాను అని ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది.