బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా మొదటిరోజు సుమారుగా 30 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. ఇక ఈ సినిమా బాలయ్య సినీ కెరియర్ లోనే కాకుండా ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల లో నెంబర్ వన్ గా నిలిచింది.. అంతేకాదు అన్ని విధాలుగా ఈ సినిమాకి పాజిటివిటీ బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. ఈ సినిమాకు ఏ సినిమా కూడా పోటీ లేకపోవడం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. 50 కోట్ల మార్క్ ను చాలా ఈజీగా దాటడం ఖాయమని అంటున్నారు.
ఇప్పుడు తాజాగా ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ మొదటిసారి నిర్మాతగా హీరోయిన్ గా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం స్కైలాబ్. ఫుల్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది కాబట్టి ..ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లను బట్టి ఆ సినిమాకు పోటీ ఇవ్వగలదా లేదా అనే విషయం రేపు తెలుస్తుంది. సత్యదేవ్ హీరోగా నిత్యమీనన్ హీరోయిన్ గా కామెడీ కాన్సెప్ట్ తో స్కైలాబ్ సినిమా ను తెరకెక్కించారు.ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూడాలి చూడాలి అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.